Monday, December 23, 2024

అరబ్ దేశాలపై నిక్కీ హేలి మండిపాటు..

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కీ హేలి మండిపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు పాలస్తీనియన్లను ఎందుకు దేశంలోకి రానివ్వడం లేదని మండిపడ్డారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌పై హేలీ ఆరోపణలు గుప్పించారు. పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా? అని ప్రశ్నించారు. పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్‌ను ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఎందుకు ఉంచుకుంటుంది? అని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News