Monday, December 23, 2024

తన ఇమేజింగ్ మాస్టర్‌పీస్‌ను ప్రదర్శించిన నికాన్ ఇండియా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇమేజింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన నికాన్ కార్పొరేషన్ యొక్క 100% అనుబంధ సంస్థ, నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈరోజు తమ సరికొత్త మిర్రర్‌లెస్ ఇమేజింగ్ మాస్టర్ పీస్, Nikon Z 8ని ప్రదర్శించింది. ఈ సరికొత్త ఆవిష్కరణ , Nikon Z 8 చురుకుదనం, పోర్టబిలిటీ, వైవిధ్యత మరియు అత్యుత్తమ శ్రేణి AI- ఆధారిత ఫీచర్ల కలయికతో కూడిన పరిపూర్ణమైన శక్తితో వస్తుంది. ఇమేజింగ్ ల్యాండ్‌స్కేప్‌ను ఒక మెట్టు పైకి తీసుకెళ్లేలా ఇది రూపొందించబడింది.

హైదరాబాద్‌లోని వివంత బై తాజ్‌లో జరిగిన ఈ అద్భుతమైన ప్రదర్శన కార్యక్రమంలో నికాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సజ్జన్ కుమార్ పాల్గొన్నారు. ఈ ఉత్పత్తి ప్రదర్శన ఇమేజింగ్ మాస్టర్‌పీస్‌కు వెనుక దాగిన అసాధారణమైన పరిశోధన మరియు ఇంజనీరింగ్‌ను మహోన్నతంగా చూపింది – Nikon Z 8 దాని అసాధారణ ఇమేజింగ్ పనితీరు, ప్రశంసనీయమైన అనుకూలత, హై-స్పీడ్ ఫ్రేమ్ క్యాప్చర్‌లో ప్రతిబింబిస్తుంది మరియు సుమారుగా 125 నిమి. 4K UHD/60p2లో మరియు దాదాపు 90 నిమిషాల వరకు 8K UHD/30p3లో రికార్డ్ చేయగలదు.

ఈ సందర్భంగా నికాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ మాట్లాడుతూ, “మా సరికొత్త వైవిధ్యమైన మరియు వినూత్న హైబ్రిడ్ కెమెరా, నికాన్ Z 8, ఇమేజింగ్ పవర్‌హౌస్‌ను ప్రదర్శించడం మాకు ఆనందంగా ఉంది. 12-బిట్ అంతర్గత 8K వీడియో రికార్డింగ్, 120fps వరకు బరస్ట్ స్పీడ్ మరియు మా అత్యంత అధునాతన ఆటో ఫోకస్ సిస్టమ్ వంటి అగ్రశ్రేణి ఫీచర్‌లతో కెమెరా కాంపాక్ట్‌నెస్ & పోర్టబిలిటీని ప్యాక్ చేస్తుంది. Z 8 అనేది స్పోర్ట్స్, ఫ్యాషన్, ల్యాండ్‌స్కేప్, వైల్డ్‌లైఫ్, వెడ్డింగ్‌లు మరియు సినిమాటోగ్రఫీ వంటి విభిన్న విభాగాలలో ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్‌లు మరియు ఫోటోగ్రాఫర్‌ల అవసరాలను తీర్చటానికి ప్రత్యేకంగా రూపొందించబడిన Nikon యొక్క మిర్రర్‌లెస్ శ్రేణికి మా తాజా జోడింపు. సృజనాత్మకత మరియు మెరుగైన పనితీరు యొక్క అత్యున్నత శిఖరం Z 8, సృజనాత్మక వ్యక్తీకరణ మరియు వీడియో స్టోరీ టెల్లింగ్ రంగంలో నూతన ప్రమాణాలను ఏర్పరచటానికి సిద్ధంగా ఉంది, ఇది మన దేశ యువతకు వారి సృజనాత్మకతను మరింత ఉన్నతంగా తీసుకెళ్లడానికి శక్తినిస్తుంది.

ఈ ప్రదర్శన కార్యక్రమంలో ఒలింపిక్ కాంస్య పతక విజేత, అర్జున మరియు ఖేల్ రత్న అవార్డుల గ్రహీత , భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ గగన్ నారంగ్ కూడా పాల్గొన్నారు . షూటింగ్ తో పాటు, చక్కటి అభిరుచి కలిగిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ ఆయన. అతను తన ఫోటోగ్రఫీ కోసం Nikon D6, Z 9, Z 400mm F2.8 లెన్స్ మరియు 800 mm FL లెన్స్ వంటి పరికరాలను ఉపయోగించి పులుల సంరక్షణ కోసం ప్రచారం చేస్తుంటారు .

Nikon Z 8, అద్భుతమైన చురుకుదనాన్ని సూచించే ఒక ఇమేజింగ్ మాస్టర్ పీస్, ఇది 10-బిట్ స్టిల్ ఇమేజ్‌ల కోసం కొత్త HLG(HEIF) ఫార్మాట్, హై-రెస్ జూమ్, చర్మాన్ని మృదువుగా చేయడం, పోర్ట్రెయిట్ ఇంప్రెషన్ బ్యాలెన్స్ మరియు ఆటో-ఫోకస్ కోసం మెరుగుపరచబడిన AI-అల్గోరిథం వంటి ఫీచర్స్ తో ఎప్పుడైనా, ఎక్కడైనా యాక్షన్ కు సిద్ధం గా ఉంటుంది. Nikon Z 8 టాప్-క్వాలిటీ ఇమేజింగ్ సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేయడంలో Nikon యొక్క బలమైన అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది, ఎందుకంటే వారు భారతీయ మార్కెట్‌ను స్టోరీ టెల్లింగ్‌లో లీనమయ్యే అనుభవంతో నిమగ్నం చేస్తారు. Nikon Z 8లో స్టోరీ టెల్లింగ్ మరియు అత్యాధునిక సాంకేతికత యొక్క శక్తివంతమైన కలయిక ద్వారా, Nikon భారతదేశం యొక్క వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ కమ్యూనిటీ తో తన బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటుంది.

లభ్యత

Nikon Z 8 కెమెరా బాడీ భారతదేశం అంతటా అన్ని Nikon అవుట్‌లెట్‌లలో INR 3,43,995.00 వద్ద అందుబాటులో ఉంది. పరిమిత కాల ప్రారంభ ఆఫర్‌లో భాగంగా, నికాన్ ఇండియా అద్భుతమైన రీతిలో ఉచితాలను సైతం అందిస్తోంది- ప్రోగ్రేడ్ డిజిటల్ 128GB CFexpress కార్డ్ మరియు Nikon Z 8తో అదనపు రీఛార్జ్ చేయదగిన Li-ion బ్యాటరీ (EN-EL15c ) వంటివి వీటిలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News