Monday, December 23, 2024

నీలం మధు రాజీనామా..పటాన్‌చెరులో బిఆర్ఎస్ కు షాక్..

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో బిఆర్ఎస్ పార్టీ షాక్ తగిలింది. పటాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ముదిరాజ్ వర్గానికి చెందిన నీలం మధు సోమవారం ఉదయం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం బిఆరఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కెసిఆర్ కు లేఖ పంపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందుగానే 105 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో పటాన్‌చెరు టికెట్ మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే దక్కింది.

అయితే ఇందులో కొందరు అభ్యర్థుల పేర్లు మారొచ్చనే ప్రచారం కూడా జరిగింది. అదే క్రమంలో పటాన్‌చెరులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నీలం మధు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. చివరి నిమిషంలోనైన కెసిఆర్.. ఈసారి పటాన్ చెరు టికెట్ తనకు ఇస్తారమోనని వేచి చూశాడు. ఈ నేపథ్యంలో నిన్న తెలంగాణ భవన్ లో కెసిఆర్ మొదట 51 మంది అభ్యర్థులకు బిఫారమ్ లు అందజేశారు. పటాన్‌చెరు టికెట్ ను ఖరారు చేస్తూ గూడెం మహిపాల్ రెడ్డికి కెసిఆర్ బిఫారమ్ అందజేశారు. దీంతో సోమవారం బిఆర్ఎస్ పార్టీకి నీలం మధు రాజీనామా చేశారు.

Also Read: బిఆర్‌ఎస్ ప్రచార రథం రెడీ..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News