Sunday, December 22, 2024

జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామానాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఏపీ జలవనరులశాఖ మంత్రిగా టిడిపి నేత నిమ్మల రామానాయుడు కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు కీలకమైన జలవనరులశాఖ అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పనులను వేగంగా చేశామని, కానీ వైసిపి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనులపై సమీక్షించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. తప్పు చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తాము పోలవరం కోసం మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. వ్యవసాయం, రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కాలువల్లో నీరు పారకుండా చేశారని విమర్శించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు, పూడిక తీతపై తొలి సంతకం చేసినట్టు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News