Sunday, April 13, 2025

ఈ జూన్ నాటికి హంద్రీవా విస్తరణ పనులు పూర్తి చేస్తాం: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ హంద్రీనీవాను వైసిపి నేత జగన్ మోహన్ నిర్వీర్యం చేశారని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిందని నిమ్మల విమర్శించారు. మంగళవారం కర్నూలు జిల్లాలో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనుల పరిశీలించారు. బడ్జెట్ లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ. 3,243 కోట్లు కేటాయించారని అన్నారు. ఈ జూన్ నాటికి హంద్రీవా విస్తరణ పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు. హెచ్ఎన్ఎస్ఎస్ కు లైనింగ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, కాల్వలు, స్లూయిజ్ కెనాల్స్ ఏర్పాటు చేసి పొలాలకు నీరు అందిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News