Sunday, April 13, 2025

బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపిదే: నిమ్మల

- Advertisement -
- Advertisement -

అమరావతి: గీతా కార్మికులకు మోకులు, వ్యాపారులకు తోపుడుబళ్లు అందజేశామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల ఆధ్వర్యంలో ఫులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టిడిపిదేనని అన్నారు. బిసి రిజర్వేషన్లను 34 నుంచి 24 శాతానికి జగన్ తగ్గించారని విమర్శించారు. వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి పాలనలో బిసి వర్గాలు మోసం, దగాకు గురయ్యాయని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News