Friday, April 4, 2025

అవినీతిపై రాజీ పడ్డారా?

- Advertisement -
- Advertisement -

-నిమ్స్‌లో ‘పడకలు’ అమ్మినా ఫర్వాలేదా?
–‘బెడ్’ దందా కేసును లోక్ అదాలత్‌లో
రాజీ చేయడంపై విమర్శలు – -కరోనా
టైంలో రూ.లక్ష తీసుకుని బెడ్
కేటాయించిన నిమ్స్ అధికారి –దీనిపై
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
–ఆధారాలతో సహా చిక్కడంతో ఎఫ్‌ఐఆర్
నమోదు –ఓ పోలీస్ ఉన్నతాధికారి
అండతో అప్పట్లో తప్పించుకున్న నిమ్స్
అధికారి –ఓ సామాజికవేత్త లేఖతో
వెలుగులోకి బెడ్‌ల దందా

 

మన తెలంగాణ/పంజాగుట్ట : అది ప్రతిష్టాత్మక నిమ్స్ ఆస్పత్రి. దేశవ్యాప్తంగా పే రొందిన హాస్పిటల్. ఇక్కడ కోవిడ్ సమయంలో ఓ వ్యక్తి తన తల్లిని చేర్పించేందు కు బెడ్ కావాలని వస్తే ఆస్పత్రి అధికారి ఒకరు రూ.లక్ష లంచం తీసుకున్నారు. రూ.వెయ్యి మాత్రమే తీసుకున్నట్లు రశీ దు ఇచ్చాడు. దీనిపై సదరు యువకుడు ఆధారాలతో సహా పంజగుట్ట పోలీసులకు, నిమ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతం గురించి చదివిన వారికి ఆశ్చర్యం కలగక మానదు. నిమ్స్ వంటి వైద్య సంస్థలో ఇలా బెడ్ కోసం రూ.లక్ష తీసుకోవడం ఏంటని విమర్శలు భారీగా వచ్చాయి. ఇది ఒక వంతైతే..ఇప్పుడు తాజాగా ఈ ఘటనపై జరిగిన ఉదంతం మరింత షాక్‌కు గురిచేస్తోంది.

అది ఏంటంటే..
పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఇంత సీరియస్ కేసును ఇప్పుడు లోక్‌అదాలత్‌లో రాజీ చేసి చేతులు దులుపుకున్నారు. దీనిపై రాందాస్ మన్నె అనే సామాజిక వేత్త అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిమ్స్ యాజమాన్యానికి, ఇతర అధికారులకు ఒక లేఖ రాశాడు. ఆపద సమయంలో అత్యవసర వైద్యం కోసం వచ్చిన వ్యక్తి విషయంలో మానవత్వం చూపకుండా..సంపాదనే ధ్యేయంగా వ్యవహరించిన సదరు అధికారిపై చర్యలు తీసుకోకుండా..లోక్‌అదాలత్‌లో రాజీ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. అసలు దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరని ఆయన ప్రశ్నిస్తున్నాడు. నిమ్స్‌లో రోజుకు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయోనని అనుమానం వ్యక్తం చేశాడు. ఇది ఇప్పుడు నిమ్స్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అరెస్టు వారెంటు జారీ అయినా…
కరోనా సమయంలో నిమ్స్‌లో జరిగిన బెడ్‌ల అమ్మకంపై పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారని తెలిసింది. ఈమేరకు అప్పట్లో ఈ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని తెలిసింది. అతన్ని విచారించగా నిమ్స్‌లో అప్పట్లో కీలక పోస్టులో ఉన్న ఒక అధికారి పేరు..అతడు చేస్తున్న అక్రమాలు వెల్లడించినట్లు తెలిసింది. దీంతో అతని పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాల గురించి తెలుసుకున్న ఆ నిమ్స్ ఉన్నతాధికారి..ఓ పోలీస్ ఉన్నతాధికారి అండతో అరెస్టు కాకుండా తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ కేసు నుంచి బయటపడేలా అడ్డదారులు తొక్కినటు్‌ల తెలుస్తోంది.

ఇంత పెద్ద తప్పుకు శిక్ష వేయరా..?
నిమ్స్‌లాంటి ధర్మాసుపత్రిలో ఏకంగా ఓ బెడ్ కోసం రూ.లక్ష వసూలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిమ్స్‌పై ఆశతో ఎంతో మంది పేదలు వస్తుండగా..ఇలా అవినీతి అక్రమాలతో పేద రోగులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
నిమ్స్ మేనేజ్‌మెంట్‌కు తెలియకుండా అంత సీరియస్ కేసును ఎలా రాజీ చేస్తారని, అడ్డంగా బుక్కయినా..అవినీతి పరులకు శిక్ష వేయకుండా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. –
నిమ్స్‌లో పడకల అమ్మకం అనేది పెద్ద నేరం కాదా? అంత పెద్ద ఘటనని సీరియస్‌గా తీసుకోకపోవడం వెనుక కారణమేంటని అడుగుతున్నారు.-
అసలు బెడ్లు ఎన్ని అమ్ముకున్నారు..ఎంత అవినీతి జరిగింది..ఎవరెవరు పాత్రధారులు అనేది విచారించకుండా ఏకంగా కేసునే రాజీ దశకు చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News