Wednesday, January 22, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో శనివారం ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణలో డైరెక్టర్ బీరప్ప, వైద్య బృందం మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తమ వంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం పైన ఎంపి సంతోష్ పిలుపు మేరకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ కృషి అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ డైరక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, అతిధులుగా డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూప రింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతివీర్, పిఆర్‌ఓ సత్యగౌడ్, ఆర్‌ఎంఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ‘భూతాళ బంగ్లా’ మూవీ నటీ నటులు
భూతాళ బంగ్లా మూవీ నటి నటులు ప్రముఖ నటుడు సంతానం, నటి సురభిలు ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణంలో శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ బాగా పెరిగిందని, ఎయిర్‌పోర్ట్ నుండి వస్తుంటే హైదరాబాద్‌లో ఎంతో అందమయిన గ్రీనరి కనిపించిందన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Bhutala-Bangla-actors

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News