- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని సురారం పోలీస్ స్టేషన్ పరిదిలోని కట్టమైసమ్మ చెరువులో కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కట్టమైసమ్మ చెరువలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెరువులోని నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల దర్యాప్తులో మృతదేహం నిమ్స్ వైద్యుడు విజయ్ భాస్కర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -