Monday, December 23, 2024

నిమ్స్ కొత్త భవనం భూమి పూజ

- Advertisement -
- Advertisement -
ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి వేముల

హైదరాబాద్: నిమ్స్ హాస్పటల్ విస్తరణలో భాగంగా నేడు (బుధవారం) రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధ్వర్యంలో నిర్మించనున్న 2,200 పడకల నూతన భవనానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. భూమి పూజ కార్యక్రమంతో పాటు ఆరోగ్య దినోత్సవంలో భాగంగా జరిగే సభ ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు, పోలీస్ శాఖకు ఆయన పలు సూచనలు చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని, ప్రణాళిక ప్రకారం అధికారులు పోలీస్ యంత్రాగం సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రి వెంట టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి, వెస్ట్ జోన్ డిసిపి జోయెల్ డేవిస్, సి.ఈ లింగారెడ్డి, ఈఈ శశిధర్, డిఈలు మోహన్, దుర్గా ప్రసాద్, డిఎంఈ రమేష్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, సిఎం ఓఎస్డీ గంగాధర్ పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News