Monday, December 23, 2024

నిమ్స్ సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

విజయవంతంగా 100వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ
నిమ్స్ వైద్యులకు మంత్రి హరీశ్‌రావు అభినందనలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న నిమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ ఆరోగ్య సం రక్షణలో చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పింది. శుక్రవారం 100వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సను నిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. అవయవ మార్పిడి ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ.. అసాధారణ మైలురాయికి చేరుకోవడం గొప్ప విషయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఒక్క నెలలోనే 30 రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రపంచంలోని అత్యుత్తమ, అధునాతన వైద్య సేవలను నిరుపేదలకు అందిస్తున్నామని అన్నారు. తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మారుస్తున్న సిఎం కెసిఆర్ అంకితభావంతో ఇదం తా సా ధ్యమైందని మంత్రి తెలిపారు. నిమ్స్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News