Sunday, December 22, 2024

తొలి భారతీయ ట్విట్టర్ యూజర్ నైనా రెఢు మనోగతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సిఈఓ ఎలన్ మస్క్ ఇటీవల ‘ట్విట్టర్’ను హస్తగతం చేసుకున్నాడు. ఆయన ఆ మైక్రో బ్లాగింగ్‌లో అనేక మార్పులు తీసుకొస్తున్నాడని చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత తొలి ట్విట్టర్ యూజర్ నైనా రెఢు తన మనోగతాన్ని తెలిపింది. నాడు ‘ఆర్కుట్’, బ్లాగింగ్ చెలామణి బాగుండేది. అప్పటికి ట్విట్టర్ ఇంకా ఆవిష్కరించబడలేదు. నాకు నాడు TWTTR (ట్విట్టర్ ప్రాజెక్ట్ కోడ్ నేమ్) నుంచి 2006లో ఈ-మెయిల్ వచ్చింది. ఆ కొత్త ప్లాట్ ఫారమ్‌లో చేరమని కోరారు. నేను చేరాను. దాంతో ట్విట్టర్ తొలి భారతీయ యూజర్ అయ్యాను.

ప్రస్తుతం ఆమె జైసల్మేర్‌లో హోటల్ లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 175000ట్వీట్‌లు చేశారు. ఆమె మాట్లాడుతూ “ నాకు నాడు ఈమెయిల్ ద్వారా ఆహ్వానం అందింది. నేను చేరితే పోలే…అన్న అభిప్రాయంతో చేరాను. భవిష్యత్తులో అది పెద్ద ప్లాట్ ఫారమ్ అవుతుందని నాకు నాడు తెలియదు. నాడు ఆ ప్లాట్ ఫారమ్‌లో అసలు భారతీయులే ఉండేవారు కాదు. అందులో ట్విట్టర్ ఉద్యోగులు, వారి మిత్రులు మాత్రమే ఉండేవారు. నేనప్పట్లో ముంబైలో పనిచేస్తుండేదాన్ని. అందుకనే నాడు నేను ట్విట్టర్‌ను అంతగా ఉపయోగించేదాన్ని కాదు”అంటూ చెప్పారు.

ఆమె బయోగ్రఫీ ప్రకారం ఆమె ఓ ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్, ఎక్స్‌పీరియన్స్ కలెక్టర్. “నా గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమిలేదు. నేనేమంతా కష్టపడలేదు కూడా. అమెరికాకు చెందిన ఒకరు ట్విట్టర్ తొలి 140 మంది యూజర్లలో నేనే తొలి భారతీయ యూజర్‌నని రాసేదాక నాకు తెలియదు. ఆ జాబితాలో నా పేరు ఉన్నట్లు కూడా నాకు తెలియదు” అని చెప్పుకొచ్చారు.
ఎలన్ మస్క్ ఇటీవల ట్విట్టర్ యూజర్లు తమకు బ్లూ టిక్ ఉండాలనుకుంటే 8 అమెరికా డాలర్లు లేక రూ. 650 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. దీనిపై నైనా మాట్లాడుతూ “డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అన్న దానిపై నాకైతే స్పష్టత లేదు. బ్లూ టిక్ అన్నది ఇప్పటిలా ఉంటుందా, లేక మారుతుందా అన్నది నాకింకా స్పష్టత రావలసి ఉంది. అప్పుడే ఏమి చేయాలన్నది నేను ఆలోచిస్తాను” అని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News