Sunday, December 22, 2024

సిఐఎస్‌ఎఫ్‌కు తొలిసారి మహిళా డిజి ఐటిబిపి చీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని కేంద్రీయ పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా నీనాసింగ్ నియమితులు అయ్యారు. సిఐఎస్‌ఎఫ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. నీనా సింగ్ రాజస్థాన్ కేడర్ 1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారిణి. ఆమెను సిఐఎస్‌ఎఫ్ డిజిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. కాగా రాహుల్ రస్‌గోత్రాను ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు (ఐటిబిపి) కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. రాహుల్ ఇప్పుడు ఐబి ప్రత్యేకాధికారిగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఐటిబిపి చీఫ్‌గా ఉన్న అనిష్ దయాళ్ సింగ్‌ను సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News