Sunday, December 22, 2024

లోయలో పడిన సైనికుల వాహనం.. 9 మంది జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

లడఖ్: లడఖ్‌లో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సైనికులతో వెళ్తున వాహనం రోడ్డుపైనుంచి జారి లోయలో పడి పోవడంతో తొమ్మిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది సైనికులున్నట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. మరో సైనికుడికి గాయాలయ్యాయి. లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని కియారీ వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.సైనికులు కారూ గారిసన్‌నుంచి లేహ్ సమీపంలోకి కియారీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News