Monday, September 9, 2024

ఇంటి గోడ కూలి 9 మంది చిన్నారులు సజీవ సమాధి

- Advertisement -
- Advertisement -

మధ్య ప్రదేశ్ సాగర్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సాగర్ జిల్లాలో ఒక పాడుపడిన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది పిల్లలు సజీవ సమాధి అయినట్లు, మరి ఇద్దరు గాయపడినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. అధికారుల సమాచారం ప్రకారం, రేవా అసెంబ్లీ నియోజకవర్గంలోని షాపూర్ గ్రామంలో ఒక మత కార్యక్రమం సమయంలో ఒక ఆలయం సమీపంలో ఉదయం 8.30, 9 మధ్య ఈ దుర్ఘటన సంభవించింది. ఇంత వరకు అందిన సమాచారం ప్రకారం, షాపూర్‌లో ఒక మత కార్యక్రమంలో గోడ కూలిన సంఘటనల 10, 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న తొమ్మిది మంది పిల్లలు మరణించినట్లు, ఇద్దరు గాయపడినట్లు సాగర్‌డివిజనల్ కమిషనర్ వీరేంద్ర సింగ్ రావత్ వెల్లడించారు.

జిల్లా కలెక్టర్ సహా సీనియర్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ సంఘటనపై విచారం వెలిబుచ్చారు. మృతుల సమీప బంధువులకు రూ. 4 లక్షలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు సిఎం తెలియజేశారు. పాడుపడిన ఇంటి సమీపంలో ఒక గుడారం కింద ‘పార్థివ్ శివ్‌లింగ్ నిర్మాణ్’ (మట్టితో శివలింగం తయారీ) కార్యక్రమం సాగుతోందని, గోడ కూలి గుడారంపై పడిందని స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి గోపాల్ భార్గవ విలేకరులతో చెప్పారు. గుడారం,శిథిలాల కిండ పిల్లలు సమాధి అయ్యారని భార్గవ తెలిపారు. పిల్లలు గుడారం కింద కూర్చున్నారని, వర్షాల వల్ల ఇంటి గోడ కూలిందని జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News