Monday, January 20, 2025

పెళ్లి జగడం చావుకొచ్చింది

- Advertisement -
- Advertisement -

పెషావర్ : పాకిస్థాన్‌లో ఓ పెళ్లి తగవు ఒకే కుటుంబానికి చెందిన తొమ్మండుగురి దారుణ హత్యకు దారితీసింది. సమీప బంధువులే వీరిని నిద్రలో ఉండగానే బుధవారం తెల్లవారుజామున కాల్చి చంపారు. ఆగ్నేయ పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తూన్వా ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ఘటన గురించి పోలీసులు వివరించారు. మలాకండ్ జిల్లాలోని బత్కేలా తహసీల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దుండగులు తెల్లవారుజామున

కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా ఇంటిలోపలికి చొరబడ్డారు. ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన వివాదం చిలికిచిలికి చివరికి ఈ సామూహిక హత్యకు దారితీసిందని వెల్లడైంది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలియగానే ప్రాంతీయ పారామిలిటరీ బలగాలు నేర ఘటనా స్థలికి చేరాయి. వెంటనే అక్కడి నుంచి మృతదేహాలను బత్కేలా హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News