Monday, April 28, 2025

ఫిలిప్పినో ఉత్సవంలోకి దూసుకుపోయిన వాహనం

- Advertisement -
- Advertisement -
  • కనీసం 9 మంది దుర్మరణం
  • వాంకూవర్‌లో ఘటన

వాంకూవర్: వాంకూవర్‌లో శనివారం రాత్రి ఒక ఫిలిప్పినో సమాజం ఉత్సవంలో జనంమీదికి ఒక వ్యక్తి తన వాహనంతో దూసుకుపోయిన ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది వ్యక్తులు మరణించారని కెనడా పోలీసులు ఆదివారం ‘ఎక్స్’ పోస్ట్‌లో వెల్లడించారు. తాము దుర్ఘటన స్థలంలో 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశామని, అతను తమకు ‘పరిచయమే’ అని పోలీసులు తెలిపారు. అనుమానితుని మొదట జనం వెంటపడి పట్టుకున్నారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. ‘ఈ సమయంలో ఈ ఘటన ఉగ్ర చర్య కాదని మాకు నమ్మకం’ అని వాంకూవర్ పోలీసులు ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈస్ట్ 41వ అవెన్యూ, ఫ్రేజర్ స్ట్రీట్ సమీపంలో శనివారం రాత్రి 8 తరువాత ఈ దుర్ఘటన సంభవించింది. ఫిలిప్పినో హీరో ఒకరి ఉత్సవం లాపులాపు డే బ్లాక్ పార్టీ ఆ ప్రదేశంలో జరుగుతోంది. ‘వాంకూవర్‌లో శనివారం రాత్రి లాపులాపు ఉత్సవంలో భయానక ఘటన జరిగిందని విని దిగ్భ్రాంతి చెందాను’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. వాంకూవర్ మేయర్ కెన్ సిమ్, బ్రిటిష్ కొలంబియా ప్రధాని డేవిడ్ ఎబీ కూడా ‘ఎక్స’లో ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. కెనడా ఫెడరల్ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. బ్రిటిష్ కొలంబియాలో అతిపెద్ద వలసదారుల బృందాల్లో ఒకటైన ఫిలిప్పినో కెనడియన్ సమాజం సాంస్కృతిక సేవలకు గుర్తింపుగా ప్రావిన్స్ ప్రభుత్వం ఏప్రిల్ 27ను లాపులాపు డేగా 2023లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News