Sunday, December 22, 2024

పాక్ బొగ్గు గనిలో పేలుడు

- Advertisement -
- Advertisement -
9మంది కార్మికుల మృతి

పేషావర్: పాకిస్తాన్‌లోని పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్సులో ఒక బొగ్గు గనిలో పేలుడు సంభవించి 9 మంది కార్మికులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఒరక్‌జయ్ గిరిజన జిల్లాలోని డొల్లి బొగ్గు గనిలో గ్యాసు లీకేజీ కారణంగా బుధవారం పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో బొగ్గు గని లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్ కూడా మరణించినట్లు వారు తెలిపారు. కార్మికుల మృతదేహాలను వెలికితీసినట్లు వారు చెప్పారు. తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను కూలిపోయిన గనిలోని శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News