- Advertisement -
విరుదునగర్ : తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో మంగళవారం రెండు వేర్వేరు పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు అధికారులు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విరుద్ నగర్ జిల్లా కమ్మపత్తి గ్రామంలో పేలుడు ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు.
- Advertisement -