తలా రూ.52 లక్షల బహుమతి ఉన్న తొమ్మిది మంది నక్సలైట్లు గురువారం చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. వారిలో చాలా వరకు మహిళా నక్సలైట్లే. లొంగిపోయిన నక్సలైట్లలో ఇద్దరు దంపతులు కూడా ఉన్నారు. ‘అమానవీయం, శుష్క భావజాలం కారణంగానే తాము ఆయుధాలు త్యజించి లొంగిపోయాం’ అని వారు తెలిపారని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కల్ము మంగ్డు, అతడి భార్య మాధవి బుధ్రి, మిడియం సుక్క అలియాస్ సమీర్ అతడి భార్య రజనీ అలియాస్ రాజే,
మహిళా కేడర్లయిన శాంతి కవసి, మద్కం సోమ్డి, నుప్పో నర్సీ, మద్కం హిడ్మే, నుప్పో హంగీ భద్రతాధికారుల ముందు లొంగిపోయారని ఆ పోలీస్ అధికారి తెలిపారు. లొంగిపోయిన ఈ నక్సలైట్లంతా ప్రభుత్వం చేపట్టిన నక్సల్స్ ఏరివేత పాలసీని శ్లాఘించారు. అంతేకాక సుక్మా పోలీసుల పునరావాసం డ్రైవ్ ‘నియాద్ నెల్లనర్’ని కూడా కొనియాడరని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు. నక్సలిజం హింసామార్గాన్ని వీడి, జాతీయ జీవనస్రవంతిలో చేరే వారికి, లొంగిపోయే వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది.