Tuesday, January 21, 2025

ఇరాన్‌లో 9 మంది పాక్ కార్మికుల హత్య

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : ఇరాన్‌లో ఒక దారుణ సంఘటనలో తమ దేశీయుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాకిస్తాన్ కోరింది. రెండు దేశాల సరిహద్దులలో పోటాపోటీ కాల్పుల సంఘటనలతో ఉద్రిక్తతలు నెలకొన్న కొన్ని రోజులకే ఇరాన్‌లో పాక్ జాతీయుల హత్య జరిగింది. పాకిస్తాన్‌తో సరిహద్దు సమీపంలోని ఇరాన్ సిస్తాన్= బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినప్పుడు తొమ్మిది మంది పాకిస్తానీ కార్మికులు మరణించగా, మరి ముగ్గురు గాయపడ్డారు. సిస్తాన్= బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని

‘శరవన్ నగర శివార్లలోని సిర్కాన్‌లో ఒక ఇంటిలో తొమ్మిది మంది ఇరానేతరులను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు హత్య చేసినట్లు సాక్షులు చెప్పారు’ అని ఇరాన్ మెహర్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ దాడికి తమదే బాధ్యత అని ఏ వర్గమూ లేదా వ్యక్తి వెంటనే ప్రకటించుకోలేదు. ఆ దాడిపై సమగ్ర దర్యాప్తుతో పాటు దానికి బాధ్యులపై వెంటనే ప్రాసిక్యూషన్ జరిపించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News