- Advertisement -
మీరట్ : ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగు లోకి వచ్చింది. మగంట్ పూరమ్ లోని మలిన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొవిడ్ సంక్షోభం సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవ మతం లోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైస్తవ మతం లోకి మారేందుకు తమకు ఎన్నో ఆశలు చూపించినట్టు సీనియర్ సూపరింటెంటెండెంట్ ఆఫ్ పోలీస్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. హిందూ దేవతల విగ్రహాలకు దూరంగా ఉండాలంటూ తమను బలవంతం పెట్టారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. బాధితులు స్థానిక బీజేపీ నేతలతో కలిసి బ్రహ్మపుత్ర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- Advertisement -