Thursday, December 19, 2024

వాహన ప్రమాదం: తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

నైనిటాల్ : ఉత్తరాఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రయాణికులను తీసుకుని వెళ్లుతున్న వాహనం శుక్రవారం అదుపు తప్పి లోయలో పడిన దశలో ఈ విషాదం నెలకొంది. నైనిటాల్ జిల్లాలోని చెదాఖాన్ మిదర్ రాదారిలో పికప్ బస్సు ప్రమాదానికి గురైన విషయాన్ని అధికారులు తెలిపారు. పట్లోట్ నుంచి అమ్జద్ గ్రామానికి వెహికల్ వెళ్లుతుండగా అదుపు తప్పిందని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News