- Advertisement -
చెన్నై : తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో కుండపోత వానలు తొమ్మండుగురిని బలి గొన్నాయి. ఎడతెరిపిలేని వానలతో ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు పిల్లలతో సహా మొత్తం తొమ్మండుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ కుటుంబాలకు రూ ఐదు లక్షల పరిహారాన్ని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్ర రాజధాని చెన్నై ఇంకా వరదనీటి ముంపులోనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఈ రోజు ఉదయం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటింది. దీనితో ఇప్పుడు తమిళనాడుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు భారీ వర్షాల బెడద పట్టుకుంది.
- Advertisement -