Monday, December 23, 2024

బైక్ రేసింగ్ కేసులో యువకుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Nine teenagers arrested in bike racing case

తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న బేగంపేట పోలీసులు
నాలుగు బైక్‌లు స్వాధీనం

హైదరాబాద్: బైక్‌లతో రేసింగ్ నిర్వహిస్తున్న తొమ్మిది మంది యువకులను బేగంపేట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేట, పటేల్‌నగర్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ ఫ్లవర్ డెకరేటర్‌గా పనిచేస్తున్నాడు, ఎండి ఆజాం విద్యార్థి, సికింద్రాబాద్, తాడ్‌బండ్‌కు చెందిన షేక్ శాదూల్ కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్నాడు. అంబర్‌పేటకు చెందిన మహ్మద్ అశ్వక్ పాన్ షాపు నిర్వహిస్తున్నాడు, సయిద్ అలీం, సయిద్, ఇద్దరు బాలురు ఉన్నారు. తొమ్మింది మంది యువకులు బైక్‌లతో ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రకాష్ నగర్ మేయిన్ రోడ్డుపై రేసింగ్ నిర్వహించారు. సైలెన్సర్లు వేరే వాటిని వాడడంతో పెద్ద శబ్దాలు వచ్చాయి. దీంతో స్థానికులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపటే ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News