Sunday, September 8, 2024

ట్రెకింగ్ చేస్తూ 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలపై ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు తొమ్మిది మంది మరణించారు. సహస్రతల్ ప్రాంతంలో ఈ సంఘటన జ రిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు స్థానిక గైడ్‌లతో కర్ణాటకకు చెం దిన 18 మంది ట్రెక్కర్లు , మహారాష్ట్రకు చెందిన ఒకరు హిమాలయాల్లో 41004400 మీటర్ల ఎత్తులో ఉన్న సహస్రతల్ ఆల్పైవ్ సరస్సు వద్ద ట్రెకింగ్ చేస్తుండగా, మంచులో చిక్కుకున్నారు. వీరిలో తొమ్మిది మంది మరణించగా, మరో 13 మందిని రక్షించ గలిగారు.

హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ మనేరి ద్వారా 22 మంది స భ్యుల ట్రెక్కింగ్ బృందం మే 29న ఉత్తరకాశీ నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ట్రెక్కింగ్ పా యింట్‌కు చేరుకుందని ఉత్తర కాశీ జిల్లా మేజిస్ట్రేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ తెలిపారు. జూన్ 7 నాటికి బృందం తిరిగి రావాల్సి ఉండగా, చివరి బేస్ క్యాంప్ నుంచి సహస్రతల్‌కు చేరుకునేసరికి వాతావరణం సరిగ్గా లేకపోవడంతో వారు దారి తప్పారని బిష్త్ చెప్పారు. రెస్కూ, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం బుధవారం తెల్లవారు జామున ఉత్తర కాశీ నుంచి బయలు దేరాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News