Monday, January 20, 2025

సూర్యాపేటలో హృదయ విదారక ఘటన..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బొజ్జగూడెం గ్రామంలో సోమవారం తొమ్మిదేళ్ల ఓ బాలిక, తన మెడ కారు విండోలో చిక్కుకుని మరణించింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుక అనంతరం వధవరులు ఇద్దరు అక్కడి నుంచి బయల్దేరేందుకు కారు ఎక్కారు. వారితోపాటు బానోత్ ఇంద్రజా అనే బాలిక కూడా వారితోపాటు వెళ్లేందుకు కారు ఎక్కి వెనక సీటులో కూర్చుంది.

ఈ క్రమంలో బాలిక తన తలను కారు విండో నుంచి బయటికి పెట్టి హుషారుగా పాటలు పాడుతుండగా.. అది గమనించని డ్రైవర్ కారు విండో బటన్ ప్రెస్ చేశాడు. దీంతో ఆ బాలిక గొంతు విండోలో ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందింది. దీంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News