Monday, December 23, 2024

రంగారెడ్డిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Nine-year-old girl was raped in Ranga Reddy

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శనివారం దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక గత రెండు నెలలుగా తరచుగా అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక జరిగిన విషయాన్ని ఏడుస్తూ తల్లిదండ్రులకు వివరించింది. తన తల్లిదండ్రులు బయటికి వెళ్లినప్పుడల్లా పొరుగు ఇంట్లో నివసించే బీహార్ వ్యక్తి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News