Tuesday, January 21, 2025

ప్రజల ఆశీస్సులతోనే తొమ్మిదేళ్ల మోడీ పాలన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన తో ప్రజల విశ్వాసం చూరగొన్నదని , ప్రధాని మోదీ సుపరిపాలన కు ప్రజలంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని , ప్రజల మద్దతు ఆశీస్సులతో మోది ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన విజయవంతంగా కొనసాగిందనీ బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు తెలిపారు.

మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాం లోభాగంగా 9 ఏళ్లలో బిజెపి మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలు , సుపరిపాలనను తెలియజేయడానికి చేపట్టిన ఇంటింటికి బిజెపి ప్రోగ్రాంని శనివారం కొత్త పల్లి మండలంలోని ఎలగందుల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి శ్రేణులు పోలింగ్ బూత్ పరిధిలోని గడపగడపకు వెళ్లి మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలన ప్రగతికి సంబంధించిన కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేశారు.

ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బోయిన్పల్లి ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వం దేశ హితం కోసం అనుక్షణం ఆలోచన చేస్తుందన్నారు. ఆదిశగానే 9 ఏళ్ల పాలనలో చారిత్రక సాహసోపేత నిర్ణయాలను మోడీ ప్రభుత్వం తీసుకుందని , ఆ పాలన నిర్ణయాలు నేడు దేశ దిశ దశ ల ను మార్చిందని , ప్రపంచంలోని అగ్రరాజ్యాల వరుసలో భారతదేశం కూడా నిలిచిందన్నారు. మోడీ ప్రభుత్వ పాలన తీరును ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, దీంతో దేశం కీర్తి విశ్వంలో మారుమోగుతుందన్నారు.

దశాబ్దాల కాలం పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ముఖ్యంగా 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్, అయోధ్య రామ మందిరం, వన్ నేషన్ వన్ రేషన్, డిజిటల్ ఇండియా, విదేశాంగ విధానం, మేకిన్ ఇండియా, నేషనల్ హైవేస్ , ఆత్మ నిర్భర్ భారత్, స్వచ్ఛభారత్ , 220 ఉచిత కరోనా వ్యాక్సిన్ , 80 కోట్ల మందికి మూడేళ్లుగా ఉచితరేషన్ , నూతన విద్యా విధానం లాంటి అనేక నిర్ణయాలతో మోడీ ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల నిధులు వెచ్చించిందన్నారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. అన్ని రంగాలను బలోపేతం చేయడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు.

అందుకే ఇంటింటికి బిజెపి ప్రోగ్రాం ద్వారా గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటే బిజెపి మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల సుపరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు కడార్ల రతన్ కుమార్, బోనాల నరేష్, బైరెడ్డి వంశీ, బోనాల ప్రతాప్, నేరెళ్ల రమేష్ ,నాగుల సంపత్, బొల్లవేణి ప్రశాంత్, జిట్ట వేణి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News