Wednesday, December 25, 2024

ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్‌తో…

- Advertisement -
- Advertisement -

Ninne Pelladatha Movie Pre Release in Hyderabad

ఈశ్వరీ ఆర్ట్, అంబికా ఆర్ట్ పతాకాలపై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా.. ‘పైసా’ మూవీ ఫేమ్ సిద్ధికా శర్మ హీరోయిన్‌గా వైకుంఠ బోను దర్శకత్వంలో వెలుగోడు శ్రీధర్ బాబు, బొల్లినేని రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. ఈ చిత్రం నుండి విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, సాయి కుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్ మాట్లాడుతూ “ఇందులో నాకు మంచి డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగున్నాయి”అని చెప్పారు. చిత్ర నిర్మాతలు బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబులు మాట్లాడుతూ “దర్శకుడు వైకుంఠ బోను మాకు చెప్పిన కథను చెప్పునట్టుగా సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది”అని అన్నారు. చిత్ర దర్శకుడు వైకుంఠ బోను మాట్లాడుతూ ఈ సినిమా డైలాగ్స్, మేకింగ్స్ బాగుంటాయని చెప్పారు. చిత్ర హీరో అమన్ మాట్లాడుతూ “మేము విడుదల చేసిన ట్రైలర్, పాటలకు ప్రేక్షకులనుండి మంచి స్పందన వచ్చి ంది. ఈ సినిమాలో సాయికుమార్‌తో నటించడానికి మొదట భయమేసినా ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు”అని పేర్కొన్నారు.

Ninne Pelladatha Movie Pre Release in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News