Monday, December 23, 2024

‘ది గోట్’ నుంచి ‘నిన్ను కన్న కనులే’ సాంగ్ రిలీజ్…

- Advertisement -
- Advertisement -

దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విజిలేస్కో సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ నిన్ను కన్న కనులే రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా ఈ పాటని బ్యూటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేశారు. ఫ్యామిలీ బాండింగ్‌ని చాలా వండర్ ఫుల్‌గా చూపిస్తూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా యువన్ శంకర్ రాజా, ఎస్పీ చరణ్, చిత్ర తమ వోకల్స్ తో మైమరపించారు. ఈ సూపర్ మెలోడీ ఇన్‌స్టంట్ హిట్‌గా నిలిచింది.

విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News