Monday, December 23, 2024

సికింద్రాబాద్ నుంచి 9వ భారత గౌరవ్ రైలు ప్రారంభo

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేల ద్వారా నడుస్తున్న భారత్ గౌరవ్ రైళ్లకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణీకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తు టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌గా ఆరంభమయిన ఈ రైలు ఇప్పటి వరకు ఎనిమిది ట్రిప్పులు పూర్తి చేసిన తదనంతరం బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 9 వ భారత గౌరవ్ పుణ్య క్షేత్రం యాత్ర రైలుగా ప్రారంభించారు. ఈ రైల్ లో ప్రయాణం కొనసాగిస్తున్న తమిళనాడుకి చెందిన చెన్నై నివాసి సీనియర్ సిటిజన్ సౌమియా గోపీనాథ్ 9 వ భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటిసీ) గ్రూప్ జనరల్ మేనేజర్ పీ . రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులకు దేశంలోని తూర్పు , ఉత్తర భాగంలోని కొన్ని పురాతన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని ఈరైలు అందిస్తోంది.

ఈ రైలు దేశంలోని తూర్పు ఉత్తర భాగంలోని ముఖ్యమైన యాత్ర, చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది ముఖ్యమైన స్టేషన్లలో ఎక్కే, దిగే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ టూరిస్ట్ సర్క్యూట్ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ , కాజీపేట , ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట్ , పెందుర్తి విజయనగరంలో కూడా ఎక్కే , దిగే సౌకర్యాన్ని అందిస్తుంది . ఈ రైలు 9 రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలోని పూరి , కోణార్క్ , గయ, వారణాసి, అయోధ్య , ప్రయాగ్‌రాజ్ వంటి దివ్యతీర్థ స్థలాలను కవర్ చేస్తుంది. ఈ రైలు అందించే అపూర్వ అవకాశం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే కాకుండా మార్గమద్యoలోని స్టేషన్ల నుండి కూడా ప్రయాణికులు ఈ రైలు ఎక్కేoదుకు ముందుకు వచ్చారు.

ఈ రైలు అన్ని వర్గాల ఆదరణను ప్రతిబింబిస్తూ 2 ఏ సీ (1 కోచ్), 3 ఏ సీ (3 కోచ్‌లు) , స్లీపర్ (7 కోచ్‌లు) కలిగిన మిశ్రమ కూర్పుతో ఏ సీ ,నాన్-ఏసీ ప్రయాణీకులకు అవకాశాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుండి వచ్చే ప్రయాణీకులుతో పాటు ఆమార్గంలోని స్టేషన్ల నుండి కూడా చేరే రెండు వైపులా ప్రయాణీoచే రైలు ప్రయాణికులు ఏ సీ నాన్-ఎసి రైలు సేవలను పొందారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ప్రముఖ, చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి ఈ రైలు గొప్ప అవకాశాన్ని కల్పింస్తుందన్నారు. ఇప్పటికే భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయన్నారు. గౌరవ్ టూరిస్ట్ రైలుకు ప్రయాణికుల నుండి గొప్ప స్పందన లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. యాత్రికులకు వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడంలో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News