Sunday, January 19, 2025

కేరళలో మళ్లీ నిపా వైరస్ విజృంభణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోండి..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ ప్రబలుతోంది. కోజిక్కోడ్‌లో గత కొద్దిరోజుల్లో నాలుగు నిపా వైరస్ కేసులు వెలుగుచూశాయి. నిపా వైరస్ సోకిన రోగులలో ఇద్దరు మరణించారు. కాగా, నిపా వైరస కేసులు మళ్లీ రాష్ట్రంలో విజృంభిస్తుండడంతో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జి అసెంబ్లీలో మాట్లాడుతూ పుణెకు చెందిన ఎన్‌ఐవి అధికారులు, చెన్నైకు చెందిన అంటువ్యాధుల నిపులణుల బృందం కోజిక్కోడ్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు.

నిపా వైరస్ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అంతేగాక కల్తీ ఆహారంతోపాటు స్పర్శ వారా కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. పందులు, మేకలు, గుర్రాలు, కుక్కలు, పిల్లుల ద్వారా ఈ వైరస్ సోకుతుంది. వైరస్ సోకిన జంతువును తినడం వల్ల కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.

నిపా వైరస్ సోకిన రోగులలో శ్వాసకోశ ఇబ్బందులు తీవ్రంగా తలెత్తుతాయి. వైరస్ సోకినప్పటి నుంచి 5 నుంచి 14 రోజులపాటు ఈ వ్యాధి లక్షణాలు కొనసాగుతాయి.

నిపా వైరస్ సోకిన వారికి ప్రధానంఆ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, కళ్లు తిరగడం, నీరసం తదితర లక్షణాలు కనపడతాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల తరహాలోనే ముక్కు, గొంతు నుంచి శాంపిల్స్ తీయడంతోపాటు మూత్ర, రక్త నమూనాల ద్వారా కూడా నిపా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

నిపా వైరస్‌కు నిర్దిష్టమైన వైద్య చికిత్స ఏదీ లేనప్పటికీ వ్యాధి లక్షణాల ఆధారంగా చికిత్స జరుగుతుంది. అయితే ఈ వైరస్ సోకిన రోగులలో మరణాల రేటు 40 నుంచి 75 శాతం ఉండడం ఆందోళన కలిగించే అంశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News