Saturday, December 21, 2024

కేరళ బాలునికి నిఫా వైరస్

- Advertisement -
- Advertisement -

మలప్పురం (కేరళ): మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలునికి నిఫా వైరస్ సోకింది. కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జి ఈ విషయాన్ని శనివారం నిర్ధారించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ బాలునిక నిఫా వైరస్ సోకిందని పుణె నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ధ్రువీకరించిందని మంత్రి తెలిపారు.

ఆ బాలుడిని కొజికోడ్ ప్రభుత్వ మెడికల్ కాలజీకి తరలిస్తామని, ఆ బాలునితో ఎవరెవరు చేరువగా ఉన్నారో వారిని కనుక్కోవడం ప్రారంభమైందని, కొందరిని వేరుగా వేరే ప్రదేశం లోకి పంపామని, వారి నమూనాలను పుణెకు పంపామని చెప్పారు. వైరస్ కేంద్రమైన పండిక్కాడ్ ప్రాంతంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News