న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ ముప్పుపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. ఐసిఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ పుణే నుంచి సంచార బిఎస్‌ఎల్ 3 ల్యాబ్‌ను కేరళలోని కోజికోడ్‌కు గురువారం పంపించారు. ఈ జిల్లాలో ఐదు నిఫా కేసులు తలెత్తడంతో ఈ వైరస్ లక్షణాలను సమగ్ర రీతిలో పరిశీలించేందుకు ఈ ల్యాబ్ ఉపకరిస్తుంది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ వైరస్‌తో ఇద్దరు మృతి చెందారు. జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో పశు సంరక్షణ విభాగపు నిపుణుల బృందం కూడా రాష్ట్రానికి బయలుదేరింది. జంతువుల నుంచి వైరస్ సోకడం గురించి నిర్థారణ చేసుకుంటారు. బ్రెయిన్‌ను భారీగా దెబ్బతీసే ఈ వైరస్‌తో 24 సంవత్సరాల హెల్త్ వర్కర్ కూడా నిఫాకు గురయ్యారు. దీనితో రాష్ట్రంలో ఈ వైరస్ ఐదుగురికి సోకినట్లు లెక్కతేలింది. ఇప్పుడు ఇక్కడకు చేరుకున్న సంచార ల్యాబ్‌తో తొలిదశలోనే వైరస్ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించవచ్చు. దీనితో చికిత్సకు వీలేర్పడుతుంది.
కేరళకు వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ నిఫా వైరస్ ఆటకట్టుకు చర్యలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -