Friday, December 20, 2024

ఇక.. పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్లే: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయని.. ఇక, పాలమూరు కష్టాలు తీరినట్లేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నదని చెప్పారు. ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామని తెలిపారు. మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తామని, సిఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు ప్రజల కాళ్లను తడుపుతానని.. మడి, మడి తడుపుతానని శపథం చేశారు. ఆ కల త్వరలోనే నెరవేరబోతుందని అన్నారు. వెయ్యి కళ్లతో ఆ సమయం కోసం రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయని మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News