Saturday, November 23, 2024

కేంద్రం లిఖిత పూర్వకంగా చెప్పాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Niranjan Reddy comments on BJP

ఢిల్లీ: తెలంగాణకు 40 లక్షల బియ్యం, 60 లక్షల వరిధాన్యం సేకరణకు ఎంవొయు కుదిరిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ భవన్ లో రాష్ట్ర మంత్రుల బృందం, టిఆర్ఎస్ ఎంపి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శనివారం సాయంత్రం నుంచి ఢిల్లీలో తెలంగాణ రైతాంగం పక్షాన వేచి ఉన్నామని, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను కలవడానికి వేచి ఉన్నామని,  కేంద్ర మంత్రి నిన్న, మొన్న ముంబై లో ఉన్నారని వారి కార్యాలయం చెప్పందని,  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు ఫోన్ లో మాట్లాడారు.

తెలంగాణ మంత్రుల బృందం, ఎంపిలు మిమ్మల్ని కలవాలని వేచి ఉన్నారని, పార్లమెంట్ రండి అక్కడికి వచ్చాక చెప్తామంటున్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని, మీరు ఇచ్చిన టార్గెట్ చాలా స్వల్పమైనది పెంచాలని కోరామని, రా రైస్ ఎంతైనా కొంటామని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారని,  నోటి మాట చెప్పడం వేరు.. లిఖిత పూర్వకంగా చెప్పడం వేరన్నారు. సోమవారం సాయంత్రం లేదా, రేపటికి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ చేరుకున్నామని,  దేశంలో ఎక్కడా లేని విధంగా 6,952 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

రైతుల ధాన్యం సేకరణకు 2, 3 రోజుల సమయం పడుతుందని, మార్కెట్ యార్డులో ధాన్యంలో తేమ కోసం అరబెడతామని, 10 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని, భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి ఖమ్మంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోయలేదని,  ఇంకా ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చేది ఉందన్నారు.

ఎంత తీసుకుంటారో రాతపూర్వకంగా కేంద్రం చెప్పాలని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రా రైస్ మొత్తము కొంటామని చెప్పారని, ధాన్యం సేకరణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 3, 4 రోజుల్లో డబ్బులు ఇవ్వాలన్నారు.  తర్వాత రాత పూర్వక హామీ ఇవ్వలేదని, తాము ఏమి చేయాలని కేంద్రం అన్నారు. నోటి మాటతో చెల్లుబాటు కాదని, ఎంత తీసుకుంటారో లిఖిత పూర్వకంగా చెప్పాలని నిలదీశారు.  రైతుల కోసం, వారి ప్రయోజనాల కోసం తాము వచ్చామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. తాము వేచి ఉన్నామని, ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే అయిపోతుందన్నారు.

రైతుల మొర వినాలని కోరుతున్నామని,  5 లక్షల ఎకరాల్లో వరి కోత ఇంకా ఉందని అంచనా వేస్తున్నామని, తాము వచ్చే ముందే అపాయింట్ మెంట్ ఆడిగామన్నారు. వాన కాలానికి సంబంధించి.. రబీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కన్ ఫ్యూజన్ అవుతున్నారని మండిపడ్డారు.  గోడౌన్లు ఖాళీ లేవు.. ఎఫ్ సిఐ అధికారులే చెబుతున్నారని, తెలంగాణలో 10 లక్షల మిల్లింగ్ కెపాసిటీ ఉందని, మిల్లింగ్ చేసిన బియ్యం రెడీగా ఉందని, వాళ్ళు తీసుకెళ్లడం లేదని, రాష్ట్రం ఇవ్వలేదని కిషన్ రెడ్డి ఒక నెపం వేస్తున్నారని విరుచుకపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News