- Advertisement -
హైదరాబాద్: మూడేళ్లలో రూ.3,384.95 కోట్లు రైతు బీమా పరిహారం అందించామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపిలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రైతులను పట్టించుకోలేదన్న వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. 67,699 మంది రైతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఇచ్చామన్నారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్‌లాంటివి బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. సంవత్సరానికి రూ.60 వేల కోట్లు వ్యవసాయ అనుబంధరంగాలకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. సిఎం కెసిఆర్ రైతు పక్షపాతి అని కొనియాడారు.
- Advertisement -