- Advertisement -
హైదరాబాద్: కృష్ణా నది నీటి పంపకాలు శాశ్వత ప్రాతిపదికన జరగాలని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని ఎపి ప్రభుత్వం తరలిస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం ఘర్షణ జరుగుతోంది. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక నది బేసిన్‌లో ఉన్న ప్రాంత నీటి అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని నిపుణులు చెప్పారని గుర్తు చేశారు. ఏకపక్షంగా రాయలసీమకు ఎపి ప్రభుత్వం నీళ్లు తరలిస్తోందని మండిపడ్డారు. శ్రీశైలం అట్టడుగు నీటి మట్టం నుంచి రాయలసీమకు నీటిని తరలించేందుకు ఎత్తిపోతలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో కృష్ణా నది నీళ్లను ఆంధ్రా పాలకులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నారని, కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉందని తెలియజేశారు.
- Advertisement -