Monday, December 23, 2024

రాష్ట్రంలో వెదురు సాగు పెరగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: వెదురు సాగుకు తెలంగాణ ప్రాంత నేలలు అనుకూలమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయంలో వెదురు సాగు అవకాశాలు, లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్‌ రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెదురు సాగుతో ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ పామ్ సాగు మాదిరిగానే ఎలాంటి చీడపీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. గతంలో వెదురు అటవీ శాఖ పర్యవేక్షణలో పెరిగేది. ప్రస్తుతం విద్యుత్ రంగంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును విరివిగా వినియోగిస్తున్నారు. ప్రతి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో అయిదు శాతం వరకు వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించింది.వెదురును ఉద్యాన పంటగా అధిక సాంద్రత పద్దతిలో ఎకరానికి వెయ్యి మొక్కల చొప్పున సూక్ష్మ సేద్యం ద్వారా సాగు చేయాలన్నారు.

నాటిన రెండేళ్ల నుంచి ఏటా 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి రెండేళ్లకు కోతకు వస్తుంది. 50 ఏళ్ల వరకు దిగుబడి వచ్చే భీమా బాంబూ రకాన్ని విరివిగా సాగు చేయాలని రైతులకు సూచించారు. కర్భన ఉద్గారకాలు తగ్గించి పర్యావరణ రక్షణకు వెదురు సాగు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 2 లక్షల ఎకరాలలో వెదురు సాగు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యచరణ చేపట్టిందన్నారు. ఈ సమావేశంలో అటవీ ఫెడరేషన్ ఎండి చంద్రశేఖర్‌రెడ్డి, శాస్త్రవేత్త నంబీ భారతి, రాహుల్ బియాని, అమన్ క్వాతా, అటవీ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Niranjan Reddy hold Zoom Meeting on Bamboo Cultivation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News