Friday, December 20, 2024

రాష్ట్రంలో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది: నీరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి, పంటల విస్తీర్ణం పెరిగిందని దీనివల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జడ్చర్ల సమీపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ గోదామును శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గోదాముల నిల్వ సామర్థ్యం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉండిందని, అలాంటిది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సామర్ధ్యాన్ని 70 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకువెళ్లామని తెలిపారు. మార్కెటింగ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్లతో పాటు, సహకార సంఘాలు బలోపేతం అయినందున రాష్ట్రంలో సహకార సంఘాల ద్వారా సైతం గోదాముల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, ఇందుకు నాబార్డు తక్కువ వడ్డీకి రుణాలను మంజూరు చేస్తున్నదని తెలిపారు.

ఇందులో భాగంగానే జడ్చర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ గోదాం నిర్మాణం చేపట్టడం జరిగిందని, దీనివల్ల ఈ ప్రాంత రైతులకు, వారు పండించిన పంటలను నిలువ చేసుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల నిలువ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పండించిన పంటలు ఎక్కడకక్కడే నిల్వ చేసుకునేందుకు సాధ్యమైనంత దగ్గరలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మిస్తున్నామని, ఇది రైతులకు ఒక మంచి అవకాశం అని మంత్రి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News