అభివృద్ధిలో ఆధర్శంగా వనపర్తి జిల్లా
వనపర్తి మార్కెట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
నాలుగు దశాబ్ధాల కల రోడ్ల విస్తరణను పూర్తి చేస్తున్నాం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: అభివద్ధిలో వనపర్తి జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ పనులు పరిశీలించి, రాజపేట సమీపంలో నూతన పార్క్ పనులు పరిశీలించి, రాజపేట సమీపంలో నూతన పార్క్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా వనపర్తి అభివృద్ధి చేపడుతున్నామని అన్నారు. వనపర్తి చుట్టూ ఉన్న చెరువులను పటిష్టం చేయడంతో జిల్లా కేంద్రంలో భూగర్భజలాలు పెరిగాయని అన్నారు.
రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగింది వనపర్తి జిల్లాలోనే అని అన్నారు. వనపర్తి మార్కెట్ రూ.49కోట్లతో నూతనంగా నిర్మించడం జరిగిందని తెలిపారు. రూ.4కోట్లతో ఎకోపార్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. రూ.2కోట్లతో వేసైడ్ మార్కెట్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. నగరం నాలుగు దిక్కులా సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అధనపు కలెక్టర్ అశిష్ సంగ్వాన్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.