Friday, December 20, 2024

పాలమూరు-రంగారెడ్డితో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం: నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల ఆధారంగా చేపట్టిన పాలమూరురంగారెడ్డి పధకం పూర్తయితే దక్షిణ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నీటి కొరత తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు వేగవంతం చేయాలని ఆధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాలమూరు-రంగారెడ్డి పథకం పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ నూతన సచివాలయం ప్రారంభించాక తొలిసారి పాలమూరు-రంగారెడ్డి పథకం పనులపైనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని, 2014నాటి తొలి కేబినెట్‌లో కూడా ఈ పథకం చేపట్టేందకు నిర్ణయం తీసుకున్నారని దీన్ని బట్టి ప్రభుత్వం ఈ పథకానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో గుర్తించాలన్నారు.

ఈ పథకం పనులు పూర్తయితే దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని 22నిమోజకవర్గాలకు సాగు, తాగు నీటి సమస్యలు తొలగిపోతాయన్నారు. కొంతమంది నాయకులు కావాలనే ఈ ప్రాజెక్టు పనులకు అడ్డు పడుతన్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా కృష్టానదీజాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఎంతో తేల్చకపోవటం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాట నీటికిలోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నట్టు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మరో రెండు నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకు ముందు మంత్రి కొల్లాపూర్ మండల పరిధిలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. మంత్రి వెంట ఈ కార్యక్రమంలో సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, ఎంపి రాములు, ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్ ఉదయ్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News