Sunday, December 22, 2024

పరకాలలో రైతులను ఓదార్చిన మంత్రులు..

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: జిల్లాలోని పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డిలు పర్యటించారు. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రులు రైతులను ఓదార్చారు. బాధిత రైతులు మంత్రులను చూడగానే కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రుల పర్యటనలో రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు, ఎంఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్ఎ చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ గండ్ర జ్యోతిలు పాల్గొన్నారు.

Niranjan Reddy meets crop loss farmers in Parakala tour

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News