Monday, December 23, 2024

రైతుల కోసమే సిఎం కెసిఆర్ నిరంతర తపన: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: పల్లెపల్లెనా రైతుబంధు విజయోత్సవాలు జరుగుతున్నాయని.. తెలంగాణలో వ్యవసాయం నాడు-నేడు అని చిన్నారులు వ్యాసరచనలు, చిత్రలేఖన పోటీలలో చాటి చెబుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైతుబంధు వారోత్సవాలలో మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశంలో ప్రకటించిన విధంగా కోటి ఎకరాలకు సాగునీరు మాటకు కట్టుబడి పనిచేస్తున్నాం. రైతుల కోసమే సిఎం కెసిఅర్ నిరంతర తపన. ముఖ్యమంత్రి కేసీఆర్, నేను పత్తి వేయాలని రైతులను కోరాం. ఇప్పుడు మార్కెట్‌లో పత్తి క్వింటాళ్లు రూ.9 నుండి రూ.10 వేలు ధర పలుకుతుంది. రాష్ట్రంలో పత్తి రైతుల మోములో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వచ్చంధంగా రైతులు ధన్యవాదాలు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి ఎంతో ధైన్యంగా ఉండేది. గత ఏడాది 61 లక్షల ఎకరాలలో పత్తి.. ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పరిమితం అయ్యారు. ప్రపంచ దేశాలలో పత్తి సాగు ఆశించినంతగా లేదు. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. రైతులు పత్తి సాగుకు మొగ్గుచూపాలి. సాగునీటితో పాటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు ఎదురొచ్చి ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎనిమిది విడతలలో రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాలలో వేయడం అపూర్వమైన విజయం. యూఎన్ఓ, ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు రైతుబంధు ఒక గేమ్ చేంజర్ అని అభినందించారు. వ్యవసాయరంగంతో పాటు అన్ని రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

Niranjan Reddy participate in Rythu Bandhu Varotsavalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News