Monday, December 23, 2024

గంటో, అరగంటో అంతరాయం రాదా?: ఉచిత విద్యుత్‌పై మంత్రుల ప్రెస్‌మీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉచిత విద్యుత్‌ విషయంలో అధికార పార్టీ బిఆర్ఎస్ విమర్శలపై కాంగ్రెస్ నాయకుల ఎదురుదాడి చేస్తుండడంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ షాక్ తగిలింది. కొందరు సబ్‌స్టేషన్ల వద్దకు వెళ్లి గంటో, అరగంటో లేదని లెక్కలు చూపుతున్నారు. సాంకేతిక సమస్యలతో గంటో, అరగంటో అంతరాయం రాదా?. విద్యుత్ కొనుగోళ్లు అన్నీ ఆన్‌లైన్‌లో సాగుతాయి. విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి అని మాట్లాడటం అవివేకం. విమర్శల కోసం విపక్షాలు వేరే రంగాలను ఎంచుకోవడం మంచిది. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని విజ్ఞత చూపాలి.తన వ్యాఖ్యలపై రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. రైతులకు ఇంత అండగా ఉన్న ప్రభుత్వం..70ఏళ్లలో ఏదీ లేదు” అని తెలిపారు.

Also Read: ఉచిత విద్యుత్‌పై రిఫరెండానికి వచ్చే దమ్ముందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News