- Advertisement -
హైదరాబాద్: త్యాగాల తెలంగాణకు బిజెపి ఏం చేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. బిజెపి ఖమ్మంలో ఉన్న ఏడు మండలాలను ఎపిలో కలిపిందన్నారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఎపికి కేటాయించారని, ప్రాజెక్టులతో ప్రజల బతుకుదెరువు పెంచిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. పంజాబ్‌ను తలదన్ని వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. యుపిఎ మంజూరు చేసిన ఐటిఐఆర్‌ను రద్దు చేశారని, విభజన హామీలను కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. గిరిజన వర్సిటీ, రైల్వే కోచ్ ఏర్పాటు ఏమయ్యాయని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని, నగరీకరణ, పట్టణీకరణకు కేంద్రం నుంచి ప్రోత్సాహం లేదని, ఇప్పటి వరకు తెలంగాణ నీటి వాటా ఎందుకు తేల్చలేదని బిజెపి ప్రభుత్వాన్ని అడిగారు.
- Advertisement -