Sunday, January 19, 2025

రఘునందన్ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

రఘునందన్ రావు వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తా
ఆధారాల్లేకుండా తనపై అభాండాలు మోపడం సరికాదు
బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు చేసిన
ఆరోపణలపై ఘాటుగా స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్ష్యాధారాలుంటే చూపించాలంటూ సవాల్ విసిరిన మంత్రి
హైదరాబాద్: తన ఆస్తులకు సంబంధించి బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్‌రావు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన ఆరోపణలు ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అసలు ఆర్‌డిస్ కాలువ ఎక్కడుందో తెలుసా అని రఘునందన్‌ను ప్రశ్నించారు. ఆయన చూపిన పత్రాలు శుద్ధ అబద్ధాలని చెప్పారు. సర్వే నంబర్ 60లోని భూముల్లో కేవలం మూడు ఎకరాల భూమి మాత్రమే తమ వాళ్లదని స్పష్టం చేశారు.

మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్‌లో ప్రభుత్వ, ఆర్‌డిఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయని రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆధారాల్లేకుండా తనపై అభాండాలు మోపడం సరికాదని మండిపడ్డారు. సాక్ష్యాధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు. రఘునందన్ రావు వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తామని తెలిపారు.

తాను ఎలాంటి ఆక్రమాలకు పాల్పడలేదని.. కావాలంటే ఎప్పుడైనా తన భూమి వద్దకు వచ్చి చూడొచ్చన్నారు. తనపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమేనని చెప్పారు. తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని తెలిపారు. తన భూమిలో ఫౌల్ట్రీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తనకున్న ఆస్తులు.. మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవేనని స్పష్టం చేశారు. తన ఇల్లు రఘునందన్‌కు ఇచ్చి.. ఆయన ఇల్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

రఘునందన్ వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తామన్నారు. తాము కొన్న భూమి కంటే గుంట ఎక్కువ ఉన్నా.. ఏ చర్యకైనా సిద్ధమని మంత్రి అన్నారు. పూర్తి పరిజ్ఞానం లేకుండా రఘునందన్ రావు మాట్లాడారని, ఆర్‌డిఎస్ కాలువ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని సూచించారు. తనకు, తన కుటుంబానికి భూములు ఉన్న ప్రాంతంలో అసలు ఆర్‌డిఎస్ భూములే లేవని చెప్పారు. రఘునందన్ రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలి..? అని నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News