Sunday, January 19, 2025

కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన నిరంజన్ రెడ్డి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. వ్యవసాయ రంగానికి రూ. 20 కోట్ల రుణాలు కేంద్రం ఇచ్చిందా? గొర్రెల యూనిట్లకు వేల కోట్ల రుణాలు కేంద్రం గొప్పతనమా? ఎరువులకు రాయితీ ఇవ్వడంపై ఎప్పట్నుంచో వస్తోందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుంచి అరబస్తా రైతులకు ఇచ్చారా..? వాస్తవాలు దాస్తూ కిషన్ రెడ్డి రైతులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.

11 కోట్ల మంది ఉన్న పిఎం కిసాన్ సన్మాన్ లబ్ధిదారులు 3 కోట్లకు తగ్గారు..? రైతుబంధును అనుసరిస్తున్న కేంద్రం రైతులకు ఇచ్చింది 9,500 వేల కోట్లేనని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. రైతు ఆదాయం రెట్టింపు అంటూనే సాగు ఖర్చు రెట్టింపు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. కాళేశ్వరం, పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారా? అని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News