Sunday, December 22, 2024

ఆర్‌డివో కార్యాలయాన్ని పునః ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: వనపర్తి రాజస్వ మండలాధికారి కార్యాలయం భవనం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది సౌకర్యార్ధం మరమ్మతులు, నిర్మాణ పనులను పూర్తి చేసి పునః ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం వనపర్తి పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి పునః ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన పద్మావతి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆర్‌డీవో కార్యాలయం రికార్డుల నిర్వహణ, సిబ్బంది సౌకర్యార్ధం మరమ్మతులు నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాగా ఏర్పడిన అనంతరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రతి ఒక్కరికి సేవలు అందేలా అధికారులు విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.

Niranjan Reddy resume RDO Office in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News